ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ. 45 లక్షలు విలువచేసే ఎర్రచందనం పట్టివేత

నెల్లూరులో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రూ. 45 లక్షల విలువచేసే 1,397 కిలోల బరువున్న 106 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

red sandle
పట్టుకున్న దుంగలతో పోలీసులు

By

Published : Oct 24, 2020, 6:23 PM IST

నెల్లూరులో భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. గూడూరు జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటిని వెలుగొండ అటవీ ప్రాంతం నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు తేలింది.

ఎర్రచందనం దుంగలు

నిందితుల నుంచి 106 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 45లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులు, ఆరిఫ్, ప్రశాంత్ కుమార్, మాలకొండలరావు.. చెన్నైకి చెందిన అతీయమాన్​లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ భాస్కర్ చెప్పారు. అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరో 15 మందిని గుర్తించామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details