నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ముందస్తు ప్రచారాలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని పలువురు కోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడ్డ కార్పొరేషన్ ఎన్నికలకు... ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందన్న సంకేతాలతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధిష్టానం నుంచి భరోసా ఉన్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
election campaigning : నెల్లూరులో ఎన్నికల వేడి... ముమ్మరంగా ముందస్తు ప్రచారం - nellore latest news
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే నెల్లూరులో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వాయిదా పడ్డ కార్పొరేషన్ ఎన్నికలకు ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సంకేతాలతో పలువురు ప్రచారం నిర్వహిస్తున్నారు.
నెల్లూరులో ఎన్నికల వేడి