ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నెల్లూరు జిల్లా మాంబట్టు గ్రామంలోని రీజన్ పవర్ టెక్ సంస్థ కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ఉంటుందో, మూసేస్తారో తెలియడం లేదని... తమకు మూడు నెలల నుంచి వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ టెక్ కంపెనీలో పని చేస్తున్న తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని 615 మంది కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి... తమకు న్యాయం చేయాలని విన్నవించారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని పవర్‌టెక్ కార్మికుల ఆందోళన
నెల్లూరు కలెక్టరేట్ వద్ద రీజన్ పవర్ టెక్ సంస్థ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
కలెక్టరేట్ వద్ద పవర్ టెక్ సంస్థ కార్మికుల ఆందోళన