నెల్లూరు నగర పాలక సంస్థలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గిరిజా,తన స్వగృహంలోనే విద్యుత్ఘానికి గురై మృతి చెందారు.ఇంట్లో అచేతనంగా పడి ఉన్న ఆమెను కారు డ్రైవర్ గమనించాడు.గిరిజా చేతిలో విద్యుత్ వైర్లు ఉన్నట్లు గుర్తించిన ఆయన,వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు.అప్పటికే గిరిజా మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.పాలక సంస్థలో నిబద్దతతో పనిచేసే గిరిజా మృతితో స్థానికులు,తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.
విద్యుదాఘాతంతో నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ మృతి
నెల్లూరు నగరపాలక సంస్థ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గిరిజా విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఉస్మాన్ సాహెబ్పేట లోని ఆమె ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ మృతి