నెల్లూరు జిల్లాలో వరద ముంపును ఎదుర్కొన్న ప్రతి గ్రామంలోనూ.. బాధితుల కన్నీరు వరద కడుతోంది. ఈ పరిస్థితుల్లో.. ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. పరామర్శకు వెళ్లిన వారిని వరద బాధితులు అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో వరద బాధితులను మంత్రి గౌతమ్‌రెడ్డి పరామర్శించారు. పెన్నా పరివాహక ప్రాంతంలోని అప్పారావుపాలెం గిరిజనులు.. తమను ఆదుకోవాలంటూ మంత్రి కాళ్ల మీద పడ్డారు.
వరదల ధాటికి సర్వం కోల్పోయామని కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి కష్టాలు విని చలించిన మంత్రి గౌతంరెడ్డి.. సుమారు కిలోమీటరు దూరం నడిచి వెళ్లి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హమీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు కొత్త కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.