ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా నివారణ చర్యలపై మంత్రి గౌతంరెడ్డి సమీక్ష - కరోనా కేసులపై మంత్రి గౌతమ్​ రెడ్డి సమీక్ష

నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన నివారణ చర్యలపై కీలక సూచనలు చేశారు.

minister goutham reddy review on corona cases in nellore district
minister goutham reddy review on corona cases in nellore district

By

Published : Apr 7, 2020, 12:51 PM IST

మంత్రి గౌతంరెడ్డి సమీక్ష

నెల్లూరు జిల్లా అధికారులతో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. కరోనా నివారణ చర్యలపై సమీక్షించారు. ధాన్యం సేకరణను ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలని... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతు కూలీలు, ఉపాధిహామీ కూలీలకు అవరోధాలు లేకుండా చూడాలని అన్నారు. మొబైల్ యాప్ ద్వారా కరోనా కేసుల వివరాలను పరిశీలించాలని పేర్కొన్నారు.

జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. క్వారంటైన్ వివరాలు, జిల్లాలో హాట్ స్పాట్ సెంటర్లుగా గుర్తించిన ప్రాంతాల్లోని పరిస్థితులపై సమీక్షించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details