ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తా: ఎంపీ ఆదాల - navyandhra mrps news

వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరులోని కస్తూరిదేవి ఆడిటోరియంలో ఆయనకు పౌర సన్మానం జరిగింది. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నేతలు గజమాలతో ఆదాలను ఘనంగా సన్మానించారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడి ఉన్నారని... వారి సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని ఆదాల చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తన వంతు సాయం చేస్తానని వెల్లడించారు.

Mp Aadhala
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

By

Published : Dec 22, 2019, 8:00 PM IST

ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details