ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

protest : 'కరెంటు ఇస్తారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?' - protest in nellore district

నెల్లూరు జిల్లా కొమ్మలపూడిలో రైతులు ఆందోళన చేశారు. కరెంటు ఇస్తారా? ఆత్మహత్యలు చేసుకోమంటారా? అంటూ అధికారులను నిలదీశారు.

నెల్లూరు జిల్లా కొమ్మలపూడిలో రైతులు ఆందోళన
నెల్లూరు జిల్లా కొమ్మలపూడిలో రైతులు ఆందోళన

By

Published : Nov 1, 2021, 9:33 AM IST

కరెంటు ఇస్తారా? ఆత్మహత్యలు చేసుకోమంటారా? అంటూ అధికారులను నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి రైతులు నిలదీశారు. ఆదివారం చెర్లోపల్లి సబ్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని వారు ఆందోళన చేపట్టారు. నిత్యం అంతరాయాలు ఏర్పడుతుండటంతో సాగు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరా సక్రమంగా లేక మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. సమస్య పరిష్కరిస్తేనే నార్లు పోసుకుంటామన్నారు. వర్షం కారణంగా ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయని, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా అందిస్తామని ఏఈ రవికుమార్‌ హామీనివ్వడంతో రైతులు శాంతించారు.

ABOUT THE AUTHOR

...view details