నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు 150కి చేరువయ్యాయి. తాజాగా 9 కేసులు నమోదు కావడంతో, జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 149కి చేరింది. కోయంబేడు మార్కెట్ ప్రభావంతో జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 65 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా, 81 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు మృతి చెందారు. పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
నెల్లూరు జిల్లాలో తాజాగా 9 కరోనా పాజిటివ్ కేసులు
నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా జిల్లాలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ జిల్లాలో 149 కేసులు నమోదవగా... 81మంది డిశ్చార్జ్ అయ్యారు.
corona cases in nellore