ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nellore Corporation Election: ఎన్నికల ప్రక్రియలో వివాదం.. పలువురికి గాయాలు - nellore-corporation-election-process

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో వివాదం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ఎన్నికల ప్రక్రియలో వివాదం
ఎన్నికల ప్రక్రియలో వివాదం

By

Published : Nov 6, 2021, 8:30 PM IST

Updated : Nov 6, 2021, 10:16 PM IST

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తెదేపా, వైకాపా నాయకులు ఘర్షణకు దిగారు. రమేశ్ రెడ్డి నగర్​లోని నామినేషన్ కేంద్రం, 43వ డివిజన్​లోని మరో కేంద్రం వద్ద తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. తెదేపా నాయకుడు కాకర్ల వెంకటరావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తెదేపా అభ్యర్ధిగా నామినేషన్ వేసిన తిరుమలనాయుడుపైనా దాడి చేశారు. రిటర్నింగ్ అధికారి రవీంద్ర ముందే ఘర్షణకు దిగడం గమనార్హం. గొడవ కారణంగా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల ప్రక్రియలో వివాదం
Last Updated : Nov 6, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details