వర్షంలో చెట్టు కిందకు ఇద్దరు మహిళలు.. పిడుగుపడి దారుణం! - Two women were killed in a lightning strike
16:46 April 21
పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి
Thunder Storm : కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో విషాదం నెలకొంది. అప్పటి వరకూ భగభగలాడిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో వర్షం ముంచుకొచ్చింది. ఈ క్రమంలో వర్షానికి తడవకుండా చెట్టు కిందకు వెళ్లారు ఇద్దరు మహిళలు. కాసేపటికే అనూహ్యంగా పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుప్పగల్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (39), ఉరుకుందమ్మ (33)గా గుర్తించారు.
ఇదీ చదవండి :అలా చేస్తామని భయపెట్టడంతో కారును అప్పగించా: డ్రైవర్