Two Leopards: కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పరిధిలో అవుకు సొరంగ పనులు జరిగే ప్రాంతానికి సమీపంలో రెండు చిరుత పులులు కనిపించాయి. చిరుతలు రోడ్డు దాటుతుండగా ఓ లారీ డ్రైవర్ తీసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది తెలిశాక మెట్టుపల్లి, రామవరం గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లాలంటే భయంగా ఉందని వాపోతున్నారు.
Two Leopards: అవుకు సమీపంలో చిరుతల సంచారం.. భయాందోళనలో ప్రజలు - latest news in kurnool
Two Leopards: కర్నూలులోని అవుకు సొరంగ పనులు జరిగే ప్రదేశానికి సమీపంలో రెండు చిరుతపులులు తిరగడం కలకలం రేపింది. రెండు చిరుతపులులు రహదారికి అడ్డంగా వచ్చి ముళ్లపొదల్లోకి వెళ్లడాన్ని ఓ లారీ డ్రైవర్ వీడియో తీశాడు.
అవుకు సొరంగ మార్గం వద్ద రెండు చిరుతల సంచారం
ఇటీవల కాలంలోనే అవుకు మండలం మెట్టుపల్లిలో రాత్రి ఎలుగుబంటి తిరగడం కలకలం రేపింది. తిరిగి అదే గ్రామ సమీపంలో రెండు చిరుతపులులు తిరగడంతో వ్యవసాయ కూలీలు, పొలం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Fire Accident: గుంటూరులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డబ్బు, బంగారం
Last Updated : Mar 29, 2022, 11:50 AM IST