కర్నూల్ నగరంలో రెండు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని సంతోష్ నగర్, ఉద్యోగ నగర్లో ఇటీవల రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. ఈ కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారు, 4 తులాల వెండి, లక్షా ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. దొంగతనం చేసిన బంగారాన్ని కర్నూల్ నగరంలోని శరాఫ్ బజార్లో అమ్మినట్లు తెలిపారు. బంగారాన్ని కొనుగోలు చేసిన ఆరుగురు వ్యాపారులను సైతం అరెస్ట్ చేశామని డీఎస్పీ వెల్లడించారు.
ఇళ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్ - arrest
కర్నూల్ నగరంలో జరిగిన రెండు దొంగతనాల కేసుల్లోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇళ్లల్లో చోరీ చేసిన ఇద్దరిని పట్టకున్న పోలీసులు