ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చదువుపై ఆసక్తి లేక విద్యార్థి ఆత్మహత్య!

కర్నూలులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దిలీప్ అనే విద్యార్థి కళాశాల వసతి గృహంలో బాత్​రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుపై ఆసక్తి లేకపోవటంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

చదువుపై ఆసక్తి లేక విద్యార్థి ఆత్మహత్య

By

Published : Aug 5, 2019, 5:09 PM IST

చదువుపై ఆసక్తి లేక విద్యార్థి ఆత్మహత్య!

కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు సమీపంలోని బీ.తాండ్రపాడు వద్దనున్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దిలీప్ అనే విద్యార్థి కళాశాల వసతి గృహంలోని బాత్​రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులు కళాశాల యాజమన్యానికి సమాచారం ఇవ్వగా... కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా ముదిగల్లు గ్రామానికి చెందిన దిలీప్కు తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నాన్నే చదివిస్తున్నాడు.చదువుపై ఆసక్తిలేకనే దిలీప్​ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details