పాదయాత్రగా మల్లన్న భక్తులు - srisailm_mallikharjuna_swamy_devotees
శ్రీశైలం మల్లికార్జునుడి సన్నిధికి భక్తులు బారులు తీరారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా...రాళ్లూరప్పలను దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్నను దర్శించుకునేందుకు శివనామస్మరణతో వెళ్తున్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు లక్షలాది భక్తులు పాదయాత్రగా తరలివస్తున్నారు. శివనామస్మరణ చేసుకుంటూ నల్లమల కొండల నుంచి శ్రీగిరి వైపు అడుగులు వేస్తున్నారు. కఠోర దీక్షతో...అడవి మార్గంలో పాదరక్షలు లేకుండానే స్వామి సేవ కోసం స్వామి సన్నిధానానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది, దాతలు తమ వంతు ప్రయత్నంగా భక్తులకు అన్నదానం, మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేస్తున్నారు. రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు భక్తులకు నీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు.
TAGGED:
మల్లికార్జున స్వామి