ప్రభుత్వం విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎం.ఏ. గఫూర్ డిమాండ్ చేశారు. కర్నూలులో మాట్లాడుతూ.. మధ్యవర్తులను తీసేసి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఐకాస ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
'విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి' - కర్నూలులో విద్యుత్ కార్మికుల ధర్నా వార్తలు
సమస్యలు పరిష్కరించాలంటూ కర్నూలులో విద్యుత్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వారికి న్యాయం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ డిమాండ్ చేశారు.
విద్యుత్ కార్మికుల ధర్నా