ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని పవన్ ర్యాలీ - పవన్ కల్యాణ్ వార్తలు

జనసేనాని ఈ నెలలో 2 రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న కర్నూలులో ర్యాలీ నిర్వహించనున్నారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Feb 7, 2020, 11:52 PM IST

Updated : Feb 8, 2020, 7:58 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 12, 13వ తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలు ఆ ప్రాంత సమస్యలు, తాము పడుతున్న ఇక్కట్లను వివరించారు. దీనికి స్పందించిన పవన్ రెండు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. 12న సుగాలి ప్రీతి కేసులో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలో ర్యాలీ చేపట్టనున్నారు. 13న జోహరాపురం బ్రిడ్జి వంతెన సమస్యపై ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. పేదల గృహ నిర్మాణ సమస్యపైనా మాట్లాడనున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి

Last Updated : Feb 8, 2020, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details