జాతీయ క్రీడా దినోత్సవాన్ని కర్నూలు క్రీడాకారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను నగరంలోని అవుట్ డోర్ స్టేడియం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి నగర పాలక సంస్థ కమిషనర్ డీ. కే. బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను క్రీడా సంఘ నాయకులు వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
కర్నూలులో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహణ - కర్నూలులో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
కర్నూలు అవుట్ డోర్ స్టేడియం ముందు జాతీయ క్రీడా దినోత్సవాన్ని క్రీడాకారులు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ పాల్గొన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకున్న కర్నూలు పట్టణ వాసులు