కాదేదీ మద్యం అక్రమ రవాణాకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. చివరకు రోగులను తరలించే అంబులెన్స్లోను పొరుగు రాష్ట్ర మద్యం రవాణాకు తెగించారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్(స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) పోలీసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు ఖాళీగా వస్తున్న అంబులెన్స్‌ను అనుమానం వచ్చి తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో 14 మద్యం బాటిళ్లను గుర్తించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ చంద్రను అరెస్ట్ చేసి మద్యం సీసాలను, అంబులెన్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
అంబులెన్స్‌లో మద్యం అక్రమ రవాణా
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు మద్యం అక్రమ రవాణాదారులు. ఆఖరికి అంబులెన్స్‌ను కూడా వదలలేదు. అయితే నిందితుడి ప్రయత్నాన్ని పసిగట్టిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేసి మద్యాన్ని సీజ్ చేశారు.
Man arrested for smuggling alcohol in an ambulance
ఇదీ చదవండి