తొలిసారి కేఈ, కోట్ల కలిసి ప్రచారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థి కె.ఈ. శ్యాం బాబు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ప్రచారం చేపట్టారు. గ్రామంలో ఉన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టారు. తమ గెలుపు ఎవరు ఆపలేరని కోట్ల ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశాన్ని గెలిపిస్తే సాగు, త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని కోట్ల హామీ ఇచ్చారు. అభివృద్ధి అంటే ఎవరో... అక్రమాలు అంటే ఎవరో... ప్రజలకు బాగా తెలుసు అని శ్యాంబాబు గుర్తు చేశారు.