ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీగా అక్రమ మద్యం, గుట్కా పట్టివేత - telangana liquor seized news

రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై.. ఎస్​ఈబీ అధికారులు, పోలీసులు నిఘా పెంచారు. దాడులు చేసి భారీ మెుత్తంలో మద్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor and gutka seized in ap
వేర్వేరు దాడుల్లో గుట్కా, మద్యం పట్టివేత

By

Published : Dec 30, 2020, 10:34 AM IST

అనంతపురం జిల్లా మడకశిర ఎస్.ఐ. శేషగిరిరావు, తన సిబ్బందితో కలిసి... అక్రమార్కులపై దాడులు చేశారు. ఈ క్రమంలో.. మండల కేంద్రంలోని యూ.రంగాపురం పోలీస్ చెక్​పోస్ట్ వద్ద ఓ వ్యక్తి వద్ద 425 గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో పట్టణంలో దాడులు నిర్వహించగా.... ఇద్దరు వ్యక్తుల వద్ద 40 కర్ణాటక మద్యం సాచెట్స్ లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని మద్యంతో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులతో పాటు గుట్కా వ్యక్తిని రిమాండ్​కు తరలించారు.

తనకల్లు మండల సరిహద్దుల్లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 350 సీసాల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పీటీఎం మండలం చెట్ల వారి పల్లికి చెందిన మంజునాథ రెడ్డి కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనంలో మద్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మంజునాథ్ రెడ్డి వాహనంలో కర్ణాటక మద్యాన్ని గుర్తించిన పోలీసులు బైక్​తో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

భారీగా బెల్లం ఊట ధ్వంసం

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పైషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మండలంలోని పెద్ద పీఆర్​సీ తాండ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 2400 లీటర్ల బెల్లం ఊటను నాశనం చేశారు.

తెలంగాణ మద్యం స్వాధీనం

అక్రమ మద్యం రవాణాపై కర్నూలు ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు... కర్నూలు పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీలత ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టడంతో.... 67 బాక్సులలో 4,104 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి...రెండు కార్లను సీజ్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో భారీగా నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా మద్యం తెప్పించి... ఓ ఇంటిలో దాచినట్టు సమాచారం రావడంతో సెబ్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 14 బ్రాండ్లకు చెందిన 1,742 బాటిళ్లను గుర్తించారు. 1435 బీర్ బాటిల్స్, 307 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను రవాణా చేసిన మహేంద్ర బొలెరో పికప్ వేన్​ను సీజ్ చేశారు. సరుకును తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ నుంచి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మద్యం బాటిళ్ల విలువ తెలంగాణా రాష్ట్రంలో రూ.4,85,000గాను, ఏపీలో రూ.ఏడు లక్షలుగా ఉంటుందని డివిజనల్ టాస్క్ఫోర్స్ సీఐ జైరామ్ సతీష్ తెలిపారు. ఈ కేసులో మద్యం నిల్వ ఉంచిన పాలకోడేరు గ్రామానికి చెందిన గుంటూరి సత్యనారాయణ రాజును అదుపులో తీసుకున్నారు. ఇతని కుమారుడు గుంటూరు శ్రీనివాసరాజు పరారీలో ఉండటంతో అతని కోసం వెతుకుతున్నారు.

ఇదీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. 'గీత దాటితే' తప్పవు బేడీలు!

ABOUT THE AUTHOR

...view details