Honey trap in Kurnool : హనీట్రాప్.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. అందంతో యువకులకు వలపు వల విసిరి, ఆ తర్వాత బెదిరించి డబ్బులు లాగుతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హనీట్రాప్‌కు ఓ యువకుడు బలయ్యాడు. పట్టణానికి చెందిన సునీల్ అనే యువకుడి సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని యువతి వీడియోకాల్ చేసింది. తాను ఆ కాల్‌కు రెస్పాండ్ అయ్యాడు. రంగంలోకి దిగిన కేటుగాళ్లు.. యువకుడి ఫోటోను మార్ఫింగ్ చేసి అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్లు సెట్ చేశారు. ఆ వీడియో తనకు పంపి డబ్బు ఇవ్వాలని, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించినట్లు బాధిత యువకుడు పేర్కొన్నాడు. డబ్బు పంపలేదనే కారణంతో ఆ వీడియోను తన స్నేహితులకు పంపినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
Honey trap in AP: మత్తుగా మాట్లాడి.. మెుత్తం లాగేసుకోవాలనుకుంది.. - కర్నూలు జిల్లాలో హనీట్రాప్ కేసు
Honey trap: ఈ మధ్య తరుచుగా హనీట్రాప్ అనే పేరు వార్తల్లో నిలుస్తోంది. మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం.. ఆ తరువాత వారితో వీడియో కాల్ చేయడం, ఆపై వారి నగ్నదృశ్యాలు సేకరించి డబ్బులు డిమాండ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. అలా కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుడు హనీట్రాప్‌లోకి లాగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Honey trap
ఇవీ చదవండి:
- బీచ్‌లో భర్తతో ప్రీతిజింటా చిల్.. రియా చక్రవర్తి అదిరిపోయే స్టిల్స్
- బౌలర్లు.. గాడిన పడతారా? కప్పు తెస్తారా?
- భూమికి గురు గ్రహం రక్ష.. మానవాళిని కాపాడుతున్న 'గురు'త్వాకర్షణ!