HEN LEAD TO FIGHT BETWEEN TWO FAMILIES: కర్నూలు జిల్లా ఆదోనిలో కోడి తెచ్చిన తంటాతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు కారణమైంది. విషయం నడి రోడ్డుపై కొట్టుకునేంత వరకు వెళ్లింది. కోడి ఇంట్లోకి వెళ్లిందనే కారణంతో.. రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు.
HEN LEAD TO FIGHT: కోడి తెచ్చిన తంట.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
HEN LEAD TO FIGHT: కర్నూలు జిల్లాలో ఓ కోడి రెండు కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. అది కాస్తా కర్రలతో కొట్టుకునేంతవరకు పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
HEN LEAD TO FIGHT BETWEEN TWO FAMILIES
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ శ్రీరాములు తెలిపారు. నిన్న రాత్రి కోడి ఇంట్లో వెళ్లిందని వాగ్వాదం చేశారని.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా ? అంటూ కర్రలతో తమపై దాడికి తెగబడినట్లు బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి:Atmakur incident: ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వమే ముద్దాయి - సోము వీర్రాజు
Last Updated : Jan 12, 2022, 1:01 AM IST