నేడు కర్నూలులో సీఎం పర్యటన - kotla
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... 8 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం... గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆర్డీఎస్, కేసీ కెనాల్ పైపులైన్ పనులకు పైలాన్ ఆవిష్కరించనున్నారు.
కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. కోడుమూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకుహాజరై... పెద్ద ఎత్తున అభివృద్ధి పనులనుప్రారంభించనున్నారు.
సీఎం షెడ్యూల్
నేడు మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి కర్నూలు విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో కోడుమూరుకు మధ్యాహ్నం 2.30 గంటలకు వెళ్తారు. అనంతరం గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆర్డీఎస్, కేసీ కెనాల్ పైపులైన్ పనులకు పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత కోడుమూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కోట్ల చేరిక
ప్రభుత్వ కార్యక్రమాలు ముగిసిన అనంతరం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి... తన కుటుంబ సభ్యులు, అనుచరవర్గంతో కలిసి తెదేపాలోకి చేరతారు.