చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చండీహోమం నిర్వహిస్తున్నారు. ఈనెల 13 నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రతువుకు నేడు రెండో రోజుకు చేరుకుంది. రేపటితో హోమం ముగియనుంది. రాష్ట్రంలో తెలుగుదేశం గెలవటంతో పాటుగా కేంద్రంలో మోదీ ఓడిపోవాలన్నదే తమ ఆకాంక్షగా నాయకులు చెప్పారు.2014లో కూడా ఇదే విధంగా చండీహోమం నిర్వహించామని అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గుర్తు చేసుకున్నారు.