ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TEMPLE: శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలపై ఆసక్తి.. ఎందుకంటే? - బ్రాహ్మణపల్లి

ఆయనో సాధారణ వ్యక్తి..! కుటుంబం కోసమే కాదు, దేవుడి కోసమూ ఆలోచిస్తాడు..! శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలు, కట్టడాల కోసం పరితపిస్తున్నాడు..! పాడైపోయి నిత్య కైంకర్యాలకు దూరమైన ఆలయాలను అభివృద్ధిలోకి తెచ్చి పరిరక్షిస్తున్నాడు.

hanuman temple
hanuman temple

By

Published : Aug 26, 2021, 5:54 PM IST

పురాతన ఆలయాన్ని సొంతనిధులతో అభివృద్ధి చేస్తున్న రమేశ్..

ఇతని పేరు రమేశ్‌. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఈయన.. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాల్వ గ్రామం సమీపంలో పురాతన ఆంజనేయ స్వామి ఆలయం ఉందని.. ఎవరూ పట్టించుకోక శిథిలావస్థకు చేరుకుందని 11 ఏళ్ల క్రితం గుర్తించాడు. స్నేహితులు, కాల్వ గ్రామస్థుల సహకారంతో.. 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి మూడేళ్ల క్రితం ఆలయాన్ని పునర్మించాడు. ఈ ప్రాంతంలోని దీప, ధూప, నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను...అభివృద్ధి చేయాలని అనుకుంటున్నట్లు రమేశ్‌ చెబుతున్నాడు.

ఈ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోనే ఉన్న ముఖమండపం, కోనేరు సహా ఇతర ఆలయాలూ శిథిలావస్థలోనే ఉన్నాయి. వాటినీ వాడుకలోకి తెచ్చేందుకు రమేశ్‌ బృందం ప్రయత్నిస్తోంది. ఆలయానికి ముఖద్వారం నిర్మిస్తుండగా దేవదాయ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పడంతో.. ఆ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ముఖ ద్వారం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రస్తుతం కోనేటి ఆంజనేయస్వామి ఆలయంలో నిత్యపూజలు, ప్రత్యేక రోజుల్లో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

LOKESH: కర్నూలు ఎస్పీకి నారా లోకేశ్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details