ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7pm
ప్రధాన వార్తలు @ 7pm

By

Published : Aug 12, 2021, 7:00 PM IST

  • శ్రీశైలం నుంచి దిల్లీకి అమిత్ షా

శ్రీశైలం మల్లన్నను కేంద్రహోంమంత్రి అమిత్ షా.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు. కేంద్ర హోం మంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నిలకడగా..

రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 70,757 పరీక్షలు నిర్వహించగా.. 1,859 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,88,910 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దంపతుల ఆత్మహత్యాయత్నం

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం కలిసుండాలని కలలుగన్నారు. వారి మధ్య తలెత్తిన చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోయారు. సయోధ్య కుదుర్చుకునేందుకు పోలీస్ స్టేషన్​కు తీసుకువెళ్లడంపై మనస్థాపం చెందారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు, పోలీసులు చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సీఎంలకు సోనియా విందు

విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విపక్ష నేతలకు విందు ఇవ్వాలని సోనియా గాంధీ యోచిస్తున్నట్లు సమాచారం. బంగాల్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు కీలక నేతలు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఎమ్మెల్యే కార్లను తగలబెట్టిన దుండగులు

అధికార పార్టీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి చెందిన రెండు కార్లను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఎమ్మెల్యేకు పరిచయమున్న వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వర్జినిటీ టెస్ట్ లేకుండానే

సైన్యంలో చేరాలంటే చేతులతో తడిమి చేసే వర్జినిటీ పరీక్షలు తప్పనిసరి అన్న విధానాన్ని ఇండోనేసియా రద్దు చేసింది. ఇకపై సాధారణ శారీరక, వైద్యపరమైన పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేసింది. దీనిపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఉవ్వెత్తున ఎగసిపడ్డ లావా

ఐరోపాలో అత్యంత క్రియాశీలకంగా ఉండే ఇటలీలోని మౌంట్​ ఎట్నా అగ్ని పర్వతం మరోసారి విస్ఫోటం చెందింది. దీంతో ఆకాశాన్ని తాకేలా పెద్దఎత్తున బాడిద విడుదలైంది. ఎగసిపడుతున్న అగ్నికీలల ధాటికి ఆ ప్రాంతమంతా నారింజ వర్ణాన్ని సంతరించుకుంది. ఈ దృశ్యాలను చిత్రించేందుకు ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • హాంఫట్‌!

పాలినెట్‌వర్క్‌ యాప్‌లోని క్రిప్టో కరెన్సీని (cryptocurrency news) చోరులు కొల్లగొట్టారు. ఈ మొత్తం విలువ రూ.4,537 కోట్లు ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొల్లగొట్టిన సొమ్మును తిరిగి ఇవ్వమని కోరుతూ హ్యాకర్స్​కు ప్రతినిధులు లేఖ రాశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రోడ్​కు ఆమె పేరు

విశ్వక్రీడల్లో పతకం సాధించిన అసోం తొలి క్రీడాకారిణి, బాక్సర్​ లవ్లీనా బోర్గోహైన్​కు రూ. కోటి అందించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. గువాహటిలోని ఓ రోడ్డుకూ ఆమె పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ​పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గెట్ రెడీ

సినీ అభిమానులు గెట్ రెడీ. థియేటర్లకు వెళ్లి సినిమా చూద్దామనుకునే మీకోసం.. ఈ వారం ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజ్​కు సిద్ధంగా ఉన్నాయి. అందులో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు?. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details