ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5PM - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM

By

Published : Nov 6, 2021, 4:59 PM IST

  • ap govt : ఇక సంక్షేమ పథకాలపై ఇంటికొచ్చి ప్రచారం.. ఏం చేస్తున్నారంటే?
    రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల(schemes) గురించిన ప్రచారాన్ని విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు(district collectors) ప్రణాళిక శాఖ సూచనలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • PRAJA SANKALPA YATRA: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. వైకాపా శ్రేణుల సంబురాలు
    ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో పార్టీశ్రేణులు వేడుకలు నిర్వహించాయి. కేక్​ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • "సారీ.. మోసం చేయలేదు" ఆసక్తిరేపుతున్న గోడపత్రికలు
    "సారీ మోసం చేయలేదు." ఈ మాటలు ఇప్పుడు రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే.. నగరంలోని పలుచోట్ల వెలిసిన గోడపత్రికరపై ఉన్న ఈ పదాలు వెనుక ఉన్న మర్మం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరు, ఎందుకు ఈ గోడపత్రికలు అంటించారన్నది తెలియని పరిస్థితి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ''రివర్స్​ గేర్'​లో మోదీ అభివృద్ధి వాహనం''
    దేశంలో వంటగ్యాస్ ధరల పెంపునకు(LPG News Today) సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్​నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) విమర్శలు గుప్పించారు. కేంద్ర వైఖరితో లక్షలాదిమంది కట్టెలపొయ్యికి పరిమితమవుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మాజీ హోంమంత్రికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
    మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ(Anil Deshmukh News) విధించింది ముంబయి కోర్టు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈనెల 2న అనిల్ దేశ్​ముఖ్​ను.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్​ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఘోర ప్రమాదం- ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి
    ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్​లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఫ్రీటౌన్​లో ఆయిల్ ట్యాంకర్ పేలడం వల్ల 91 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ విపత్తు నిర్వహణ ఏజెన్సీ డైరెక్టర్ మొహమద్ లమ్రేన్ బా వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అన్నీ తెలిసే నేరం చేశాడు.. అతనికి 'ఉరి' తప్పదు'
    సింగపూర్​లో వచ్చే వారం ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న భారత సంతతికి చెందిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభ్యర్థనలపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. అన్నీ తెలిసే అతను నేరం చేశాడని.. నాడు జరిగిన అంశాలపై నిందితునికి పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'సెమీస్ రేసులో ఉత్కంఠ.. అఫ్గాన్-కివీస్​పైనే ఒత్తిడి'
    టీ20 ప్రపంచకప్​ సెమీ ఫైనల్​ రేసులో గ్రూప్-2 నుంచి ఎవరు నిలుస్తారో అనే విషయం ఆదివారం తెలియనుంది. టీమ్ఇండియా నాకౌట్​కు చేరుకోవాలంటే న్యూజిలాండ్​పై అఫ్గానిస్థాన్ గెలవాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లు కూడా సెమీస్ రేసులో ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బ్రేకప్​ అయింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ
    తనకు ఈ మధ్య బ్రేకప్​ అయిందని చెప్పిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం బాధలో ఉన్నానని అన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియదని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details