- భద్రత పెంపు
తెలుగురాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాద పరిస్థితులు తలెత్తాయి. నాగార్జునసాగర్, పులిచింతలప్రాజెక్టుల వద్ద పోలీసుల మోహరింపుంతో...ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏపీ అనుమతి లేకుండానే తెలంగాణ జెన్కో...విద్యుదుత్పత్తి ప్రారంభించటంతో వివాదం మొదలైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- డెల్టా వేరియంట్ కలకలం
విశాఖలో(vizag) కరోనా డెల్టా వేరియంట్(corona delta variant) కేసు నమోదవడం కలకలం రేపింది. వాంబే కాలనీకి చెందిన ఓ మహిళలో ఈ వైరస్(virus)ను గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఏసీబీకి చిక్కారు
విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.4.5 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు రవికుమార్, రాజా చిక్కారు. ఏసీబీ అధికారులు.. చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రామోజీ ఫౌండేషన్‌కు మంత్రుల కృతజ్ఞతలు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ నూతన భవనానికి ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రామోజీ ఫౌండేషన్ సహకారంలో ఈ పీఎస్‌ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రామోజీ ఫౌండేషన్‌కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'వైద్యుల సేవలు భళా!'
కరోనాపై పోరులో వైద్యుల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మహమ్మారిపై విజయం సాధించడంలో వారి అనుభవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగ బడ్జెట్‌ను రెట్టింపు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మొసలి హల్‌చల్