ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 5pm
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Dec 30, 2021, 5:00 PM IST

  • రవాణాశాఖ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్య...నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు

రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా షోరూమ్‌లలో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • MINISTER PERNI NANI: నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చు: పేర్ని నాని

MINISTER PERNI NANI: సినిమా థియేటర్లకు తాత్కాలికంగా ఊరట ఇచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుని చట్టపరంగా అవసరమైన అనుమతులు, వసతులను కల్పించి.. జిల్లా జేసీలను సంప్రదించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఆర్థికశాఖ అధికారుల భేటీ

Finance Department Officials Meet Govt Employees: పీఆర్సీ సహా ఆర్ధిక అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. సమావేశంలో పీఆర్సీకి సంబంధించి ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు ఆర్ధికశాఖ అధికారులు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • MA Shariff: వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలతో తెదేపా పొత్తు: ఎంఏ షరీఫ్

MA Shariff Comments: మాజీ శాసనమండలి ఛైర్మన్​, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జగన్​ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఉత్తరాఖండ్​లో రూ.17వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

Modi Uttarakhand Visit: ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరాఖండ్​లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • యూట్యూబ్​ చూసి దొంగ నోట్లు ప్రింటింగ్- ఇంజినీర్ అరెస్ట్​

Fake Currency Racket Maharashtra: యూట్యూబ్​లో చూసి దొంగ నోట్లు తయారు చేయడమే కాక వాటిని చలామణి చేస్తున్న ఇంజినీర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,20,000 విలువ గల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భారీ భూకంపం

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 7.3 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గడువు పొడిగింపు

EPF nomination deadline: ఈపీఎఫ్​ ఈ-నామినేష‌న్ జ‌త చేయనివారికి శుభవార్త. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ జ‌త చేయ‌వ‌చ్చు. దీనికి ఇప్పటివరకు ఎలాంటి గడువు తేదీని నిర్ణయించలేదని పేర్కొంది ఈపీఎఫ్​ఓ. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Rewind 2021: విశ్వవేదికపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు

Best women players performance in 2021: చరిత్ర సృష్టించినవారు ఒకరు.. ఒకే పారాలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన వారు మరొకరు.. పతకం గెలవకపోయినా ముద్దుబిడ్డ అయినవారు ఇంకొకరు.. ఇవి ఈ ఏడాది మన భారత మహిళా ప్లేయర్లు సాధించిన ఘనతలు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్​ సీక్వెన్స్​ కోసం 65 రాత్రులు

RRR Interval: 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ పార్ట్​ షూటింగ్​కు సంబంధించిన క్రేజీ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ సీక్వెన్స్ ఎన్ని రోజులు చిత్రీకరణ చేశారు? ఖర్చు ఎంతైందంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details