ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @9PM

..

By

Published : Sep 11, 2021, 9:00 PM IST

TOP NEWS @9PM
ప్రధాన వార్తలు @9PM

  • CM Jagan: వారంలో బాషా సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశం
    కడప జిల్లాకు ఓ మైనార్టీ కుటుంబం.. సోషల్‌ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోపై(selfie video) సీఎం జగన్‌(cm jagan) స్పందించారు. ఈ విషయంపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Rain Alert: అల్పపీడన ప్రభావం.. రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు!
    తూర్పుమధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా - బంగాల్‌ తీరం వెంబడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • chandra babu: పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరు?: చంద్రబాబు
    అక్బర్ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • TS News: డ్రోన్ల ద్వారా ఔషధాలు..'మెడిసిన్ ఫ్రమ్ ది స్కై' ప్రాజెక్టు ప్రారంభం
    డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే బృహత్​ కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభమైంది. మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు(Medicine from the sky) పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా దీనికి శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా
    గుజరాత్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ భవన్‌ కార్యక్రమంలోపాల్గొన్న రూపానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Neet 2021: ఆదివారమే నీట్​ పరీక్ష.. ఇవి తప్పనిసరి!
    వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్​ 12న నీట్ పరీక్ష(Neet 2021) జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది.. దరఖాస్తు చేసుకున్నారు. ఆభరణాలు, బూట్లు సహా పలు వస్తువులకు అనుమతి లేదు. ఈ క్రమంలో పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు ఈ విషయాలు తెలుసుకోండి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 9/11 anniversary: బైడెన్​.. క్లింటన్​.. ఒబామా 'మౌనం'
    9/11 దాడుల 20వ వార్షికోత్సవం (9/11 anniversary) నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ దంపతులు నివాళులు అర్పించారు. ఘటన జరిగిన ప్రదేశంలో మౌనం పాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కస్టమ్స్​ సుంకం తగ్గింపు.. దిగిరానున్న వంట నూనె ధరలు!
    దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్​, సోయా, సన్​ఫ్లవర్​ ఆయిల్స్​ బేసిక్స్​ కస్టమ్స్​ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. దీంతో దేశంలో వంట నూనెల ధరలు(edible oil price) మరింత దిగిరానున్నాయి. శనివారం నుంచే కొత్త సుంకాలు అమలులోకి వస్తాయని కేంద్ర వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IND vs ENG: ఐదో టెస్టు రీషెడ్యూల్‌ కోసం రంగంలోకి గంగూలీ
    ఇంగ్లాండ్​తో టీమ్​ఇండియా (IND vs ENG) ఐదో టెస్టు రద్దు కావడం వల్ల ఇరు జట్లకూ భారీ మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్​ను రీషెడ్యూల్​ చేయడానికి రంగంలోకి దిగాడని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సాయిధరమ్​ తేజ్​ ఆరోగ్యంపై స్పందించిన చిరు
    రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై(Sai Dharam Tej health condition ) అభిమానులు(sai dharam tej fans) ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. మోగాస్టార్​ చిరంజీవి స్పందించారు. తన మేనల్లుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడొద్దని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details