ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

TOP NEWS @ 5 PM
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Mar 3, 2021, 5:01 PM IST

  • పుర పోరు..

రాష్ట్రవ్యాప్తంగా పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో... అభ్యర్థుల తుది జాబితా, ఏకగ్రీవం అయిన స్థానాలను అధికారులు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రచార హోరు

మున్సిపల్​ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వీడిన మిస్టరీ

విజయనగరం జిల్లాలో యువతి కాళ్లు చేతులు కట్టి పడేసిన కేసులో మిస్టరీ వీడింది. కుటుంబసభ్యులను నమ్మించేందుకు యువతి నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కీలక ఆదేశాలు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఎస్​ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసంది. ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కలాం సలహాదారుడికి కీలక పదవి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ప్రముఖ సినీనటుడు, మక్కల్​ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్​ పార్టీ కార్యవర్గం విస్తరణపై దృష్టి పెట్టారు. బుధవారం వీ పొన్​రాజ్​ను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఎప్పుడైనా​ తీసుకోవచ్చు'

ప్రజలు 24 గంటల్లో ఎప్పుడైనా కొవిడ్​ టీకా తీసుకునేందుకు వీలు కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకే టీకా పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • స్థావరాలపై దాడి

ఇరాక్​లోని అమెరికా - ఇరాక్​ వైమానిక స్థావరంపై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఇరాక్​ సైన్యం స్పష్టం చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • హెచ్చుతగ్గులు

పసిడి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. దిల్లీలో బుధవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.208 దిగొచ్చింది. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రాద్ధాంతం ఎందుకు?'

స్పిన్​ ట్రాక్​లపై ప్రస్తుతం అనవసర రాద్ధాంతం జరుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అన్నాడు. గతంలో తమ జట్టు అతితక్కువ ఓవర్లలోనే వికెట్లు చేజార్చుకున్నా.. ఆ పిచ్​లపై ఎలాంటి విమర్శలు చేయలేదని గుర్తుచేశాడు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సినిమా ముచ్చట్లు

'బిగ్​బాస్'​ ఫేమ్​ సోహైల్​ హీరోగా తన తొలి సినిమా ప్రారంభమైంది. గోపీచంద్​ 'సీటీమార్' టైటిల్​ సాంగ్​ రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తోంది. '​లవ్​ లైఫ్​ అండ్​ పకోడి'​ ట్రైలర్​ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకా పలు చిత్ర విశేషాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details