పల్నాడు ప్రాంతంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని... అక్కడ ఏదో జరిగిపోతోందని తెదేపా అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. కాకినాడలో మాట్లాడిన ఆమె గత ఐదేళ్లలో తెదేపా చేసిన అకృత్యాలు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే... తెదేపా రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. బాధితులను సురక్షితంగా పోలీసు రక్షణతో స్వస్థలాలకు తీసుకెళ్తామంటే... వారు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెదేపా పాలనలో పల్నాడు ప్రాంతంలో 6 రాజకీయ హత్యలు జరిగాయని, అక్రమ మైనింగ్, భూకబ్జాలు, కె - టాక్స్లతో ప్రజలు దోపిడీకి గురయ్యారని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే 144 సెక్షన్ విధించామని హోంమంత్రి స్పష్టం చేశారు. తెదేపా నేతలు అనుమతి లేని చోటకు వెళ్తున్నారనే గృహనిర్బంధం చేశామని చెప్పారు.
'అనుమతి లేని చోటకు వెళ్తున్నారనే గృహనిర్బంధం' - sucharita on tdp leaders house arrests
పల్నాడు ప్రశాంతంగా ఉందని... కావాలనే తెదేపా అసత్య ప్రచారం చేస్తోందని హోంమంత్రి సుచరిత ఆరోపించారు. తెదేపా గతంలో చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే చలో ఆత్మకూరు పేరిట రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. తెదేపా నేతలు అనుమతి లేని చోటకు వెళ్తున్నారనే గృహనిర్బంధం చేశామని తెలిపారు.
అనుమతి లేని చోటకు వెళ్తున్నారనే గృహనిర్బంధం
TAGGED:
latest news on sucharita