ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Idols destroyed: సర్పవరంలో విగ్రహాల ధ్వంసం...ఆకతాయిల పనిగా అనుమానం

Idols destroyed: సర్పవరంలో దశావతార విగ్రహాల్లో కొన్నింటిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మందుబాబులు, ఆకతాయిల దుశ్చర్యగా అనుమానాలు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Some idols were destroyed
విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు

By

Published : Apr 23, 2022, 9:11 AM IST

Idols destroyed: కాకినాడ గ్రామీణం పరిధిలో సర్పవరం కూడలి నుంచి స్థానిక ప్రసిద్ధ భావనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన దశావతారాల విగ్రహాల్లో కొన్నింటిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గోదావరి నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో సుందరీకరణ పనులు చేశారు. ఇందులో భాగంగా విభాగిపై పచ్చదనం పెంచి, మధ్యలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి విగ్రహాలను ఏర్పాటుచేశారు. కొన్నాళ్లు సంరక్షించి ఆ తర్వాత గాలికొదిలేశారు. అక్కడి విగ్రహాల్లో కొన్ని ధ్వంసమైనట్లు శుక్రవారం వెలుగుచూసింది. మందుబాబులు, ఆకతాయిల దుశ్చర్యగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదీ చదవండి: POLAVARAM : పోలవరం డయాఫ్రం వాల్‌ విధ్వంసం... ఎవరిదీ వైఫల్యం?

ABOUT THE AUTHOR

...view details