మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు వ్యవహరంలో.. ముఖ్యమంత్రి జగన్‌కు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఈ లేఖతో పాటు భాజపా అగ్రనేత ఆడ్వాణీ.. అశోక్ గజపతిరాజును గౌరవిస్తున్న ఫొటోను సీఎంకు పంపిన లేఖలో జతపరిచారు. ఈ ఫొటోను చూసి.. ఇక నిర్ణయించుకోవాల్సింది మీరేనని అందులో పేర్కొన్నారు.
అశోక్ గజపతిరాజుపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. సీఎం జగన్‌కు ముద్రగడ గతంలో లేఖ రాశారు. వైకాపా నాయకులు గౌరవనీయమైన వ్యక్తిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. వైకాపా నేతలెవరూ అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని కోరారు.