ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రిజిస్ట్రార్ ఆఫీస్​లో ప్రేమ పెళ్లి.. సడెన్​గా అమ్మాయి తల్లిదండ్రుల ఎంట్రీ.. ఆ తర్వాత..! - కాకినాడలో ప్రేమ వివాహం లో ఘర్షణ

కాకినాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనిపించిన దృశ్యం చూపరులను కలచివేసింది. ఓ ప్రేమ జంట వివాహం చేసుకుని తల్లిదండ్రులను కాదని వెళ్లిపోతున్న దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రుల ఆరాటం.. తమ అందమైన భవిష్యత్ కోసం తపన పడే ప్రేమికుల పోరాటం. కారణం ఏదైనా ఈ దృశ్యాలు ప్రతి గుండెను పిండేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనిపించిన ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాకినాడలో ప్రేమ వివాహం
కాకినాడలో ప్రేమ వివాహం

By

Published : Aug 27, 2021, 7:55 PM IST

Updated : Aug 28, 2021, 12:01 PM IST

కాకినాడలో ప్రేమ వివాహం

అమ్మ, నాన్న, ఓ కూతురు... ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో ప్రేమ కలవరం రేపింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు... వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అలజడి రేగింది. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన ప్రేమికుడు ఓ వైపు... జీవితాన్నే తన కోసం ధారబోసిన తల్లిదండ్రులు మరోవైపు. ఈ పరిస్థితుల నడుమ ఆ యువతి మానసికంగా నలిగిపోయింది.

ముక్కూమొహం తెలియని వ్యక్తి... తమ కూతురును బాగా చూసుకుంటాడా..? లేదా.. ? అనే సంశయంతో కన్నబిడ్డ ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు ఆ తల్లిదండ్రులు. ఏ నాటికైనా తల్లిదండ్రుల మనసు మారి, తన కుటుంబాన్ని చేరదీస్తారని భావించిన ఆ తనయ... ప్రేమ పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది. ప్రియుడితో కలిసి నేరుగా సబ్​రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వివాహానికి సిద్ధమైంది. కొందరు స్నేహితుల మధ్య వీరి వివాహ క్రతువు ముగిసింది.

విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. కూతురును అడ్డుకుని ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. ఉద్రిక్త ఘటనల మధ్య నవవధువును తన తల్లిదండ్రుల నుంచి వరుడు బలవంతంగా తీసుకువెళ్లాడు. కూతురు తమను విడిచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

ఇదీచదవండి.

Corona Cases: రాష్ట్రంలో ఈ రోజు కరోనా కేసులెన్నంటే..?

Last Updated : Aug 28, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details