ఇదీ చదవండి:
వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కలిసి పనిచేయాలి: కన్నబాబు
వచ్చే ఖరీఫ్ నుంచి రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కృషి భవన్‌లో ఏర్పాటు చేసిన రైతు భరోసా వర్క్‌షాపులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మొదటి విడతగా తూర్పుగోదావరి జిల్లాలో 310 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ - కర్షక్‌లో నమోదు కాకపోయినా కందులు, శనగలు పండించే రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.
వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు