ETV Bharat / city
కాపులను విస్మరిస్తే సహించేది లేదు: జ్యోతుల నెహ్రూ - ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోంది:జ్యోతుల నెహ్రు
కాపులను విస్మరిస్తే సహించేది లేదని మాజీ శాసన సభ్యుడు, తెదేపా నేత జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించడం కుదరదని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదన్నారు.
కాపులను విస్మరిస్తే ఊరుకోం:తెదేపా నేత జ్యోతుల నెహ్రు
By
Published : Jul 28, 2019, 2:32 PM IST
| Updated : Jul 28, 2019, 3:05 PM IST
కాపులను విస్మరిస్తే ఊరుకోం:తెదేపా నేత జ్యోతుల నెహ్రు వైకాపా ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కాపులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కాపులను రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్..ఈబీసీ రిజర్వేషన్లను ప్రత్యేకంగా వర్గీకరించటం కుదరదని చెప్పటం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ఆమోదం పొందిన నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకున్నారని... కనీసం చర్చకు తీసుకురాకుండా తోసిప్పుచ్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాపు రిజర్వేషన్లపై కేంద్రంపై పోరాడాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో తెదేపా ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడుతున్నామని హెచ్చరించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రైతు బంధు కింద రూ.12,500 ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఆర్థికసాయం చేస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కేంద్ర సాయం కలుపుకుని రూ.12,500 ఇస్తామని అంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. మడమ తిప్పడం అంటారో.. మాట తప్పడం అంటారో మీరే నిర్ణయించుకోవాలంటూ ఎద్దేవా చేశారు.
Last Updated : Jul 28, 2019, 3:05 PM IST