- Electrical Buses in State : ఇక రాష్ట్రంలో 'ఈ-బస్సులు'.. ఈ ఏడాదిలోనే..!
రోజు రోజుకి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుండటంతో...దేశవ్యాప్తంగా కాలుష్య రహిత ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆశయంగా పెట్టుకుంది.ఈ లక్ష్య సాధన దిశలో భాగంగా రాష్ట్రానికి 350 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయి.
- CHANGES IN ROAD WIDTH: రోడ్డు వెడల్పు కుదింపునకు గ్రీన్ సిగ్నల్.. వెల్లువెత్తుతున్న వ్యతిరేకత
విశాఖలో ప్రతిపాదిత బృహత్తర ప్రణాళిక రోడ్లను.. ఇష్టానుసారం మార్చడం, తొలగించడంపై.. వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరి ప్రయోజనాల కోసం.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
- RIVER BOARDS MEETING: నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష
కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లతో వర్చువల్‌గా కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ భేటీ అయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపై సమావేశంలో చర్చిస్తున్నారు.
- TWO MURDERS: కర్నూలు జిల్లాలో జంట హత్యలు..వేట కొడవళ్లతో దాడి
కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కౌతాళం మండలం కామవరంలో భూముల అంశంపై.. వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో వేట కొడవళ్ళతో దాడి చేసి అత్యంత కిరాతకంగా ప్రత్యర్థులను చంపేశారు.
- మహిళపై గ్యాంగ్‌రేప్.. జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు..!
దిల్లీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనలో నిందితులు.. బాధిత మహిళ జుట్టు కత్తిరించి, ముఖాన్ని నల్లగా మార్చి, చెప్పుల దండను మెడలో వేసి వీధుల్లో తిప్పారని పోలీసులు వెల్లడించారు.
- పెళ్లైన 6నెలలకే కొడుకు మృతి.. కోడలికి అత్త రెండో పెళ్లి
ఇంట్లో అడుగుపెట్టిన కోడలిని కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకునే అత్తలు చాలా అరుదు. అలాంటిది కొడుకు మరణిస్తే.. కోడలికి రెండో పెళ్లి జరిపించేవారు ఉంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతానికి చెందిన కమలా దేవి.. తన కోడలికి ఇలాగే చేశారు.
- డ్రగ్స్ స్మగ్లర్ల చొరబాటు యత్నం.. 27 మందిని చంపిన సైన్యం
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 27 మందిని జోర్డాన్ సైన్యం కాల్చి చంపింది. సిరియా నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. వారిని హతమార్చినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది.
- తగ్గిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా..
దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది.
- ధోనీ ఫోన్ నెంబరు ఇప్పటికీ నా దగ్గర లేదు: రవిశాస్త్రి
టీమ్ఇండియా మాజీ సారథి మహీ లాంటి వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ధోనీ ఫోన్ ఎక్కువ ఉపయోగించడని, అతడి నెంబరు కూడా ఇప్పటికీ తన దగ్గర లేదని చెప్పాడు.
- సమంతనే ముందు విడాకులు కోరుకుంది: నాగార్జున
చై-సామ్ విడాకులపై మరోసారి స్పందించిన నాగార్జున.. సమంత తొలుత విడాకులు కావాలని కోరిందని తెలిపారు. దాంతో చైతూ అంగీకారం చెప్పాడని అన్నారు.
AP TOP NEWS @3PM