- వర్షసూచన
వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నిలకడగా కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,590 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,539 కరోనా కేసులు, 12 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి 1,140 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సెప్టెంబర్ 1న భేటీ
కేంద్ర గెజిట్‌పై సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డులు భేటీ కానున్నాయి. సెప్టెంబర్ 1న ఉదయం కృష్ణా బోర్డు సమావేశం జరగనుండగా.. సాయంత్రం 4 గంటలకు రెండు బోర్డులు సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'శ్వేతపత్రం విడుదల చేయాలి..'
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ బడుల్లో చదివితే 7.5% రిజర్వేషన్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు వృత్తి విద్య కోర్సుల్లో చేరడానికి పడే ఇబ్బందులను తప్పించడానికి కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. యూజీ అడ్మిషన్లలో వారికి 7.5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తెచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వినూత్న దరఖాస్తు