ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడప: పులివెందుల కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ కృష్ణారెడ్డి..కొందరు భయపెడుతున్నారంటూ పిటిషన్... - Viveka PA approached Pulivendula Court

Viveka PA approached Pulivendula Court
పులివెందుల కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ కృష్ణారెడ్డి..కొందరు భయపెడుతున్నారంటూ పిటిషన్...

By

Published : Dec 28, 2021, 12:54 PM IST

Updated : Dec 28, 2021, 3:54 PM IST

12:47 December 28

Viveka PA approached Pulivendula Court : పులివెందుల కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ కృష్ణారెడ్డి.

పులివెందుల కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ కృష్ణారెడ్డి.

Viveka PA approached Pulivendula Court : వైఎస్ వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్యకేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకులు ప్రమేయం ఉందనే విధంగా సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని కృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆక్షేపించారు. న్యాయం చేయాలని గతంలోనే పోలీసులను, ఎస్పీని కోరినట్లు తెలిపారు. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు.

ఇదీ చదవండి : CBI On YS Viveka Murder Case: వివేకా హత్య కుట్రలో శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి: సీబీఐ

Last Updated : Dec 28, 2021, 3:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details