ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుట్టుగా మట్టి తవ్వకాలు,సెలవులో ఉన్నామన్న అధికార్లు

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో కొత్తగా వేస్తోన్న లే అవుట్ కు, కొండమట్టి లారీలు తరలి వెళుతున్నా అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. .

By

Published : Sep 17, 2019, 12:22 PM IST

Updated : Sep 17, 2019, 12:30 PM IST

గుట్టుగా మట్టి తవ్వకాలు..

గుట్టుగా మట్టి తవ్వకాలు

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో రియల్టర్ల అక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గుట్టుగా మట్టి తవ్వకాలులంకోజనపల్లి రోడ్డులో అనుమతి లేని లే అవుట్ కు,అక్రమంగా కొండ మట్టిని తరలించి చదునుచేస్తున్నారు.అది కూడ రాత్రిపూట,సెలవు రోజుల్లో గుట్టుగా సాగడంతో స్థానికులు అయోమయానికి గురవుతున్నారు.ఈ తతంగమంతా అధికార్లకు తెలిసే జరుగుంతుందన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై స్థానికులు ఎమ్మార్వో వివరణ అడిగేందుకు ప్రయత్నించగా,తాను సెలవులో ఉన్నానని సదరు అధికారి సమాధానం ఇవ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

Last Updated : Sep 17, 2019, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details