Two workers injured: వైయస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఎం.తుమ్మలపల్లె యురేనియం పరిశ్రమలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిశ్రమలోని మిల్లులో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. మిల్లులో బిహార్‌కు చెందిన రవీంద్రపాల్, ఉపేంద్రకుమార్ యాదవ్ కూలీలుగా పనిచేస్తున్నారు. గురువారం గొట్టాలకు మరమ్మతులు చేస్తుండగా వేడినీళ్లు లీకయ్యి.. మీద పడ్డాయి. ఉపేంద్రకుమార్ యాదవ్‌కు తీవ్రగాయాలు కాగా, రవీంద్రపాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గతంలోనూ పరిశ్రమలో ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. ఈ విషయమై పరిశ్రమ జీఎం ఎం.ఎస్.రావును వివరణ కోరగా పరిశ్రమలో స్వల్ప ప్రమాదం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Two workers injured: యురేనియం పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు - యురేనియం పరిశ్రమలో వేడినీళ్లు లీకై ఇద్దరు కార్మికులకు గాయాలు
Two workers injured: పరిశ్రమల్లో రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కార్మికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇటీవల అచ్యుతాపురం ఘటన మరువక ముందే వైయస్‌ఆర్ జిల్లాలోని యురేనియం పరిశ్రమలో గొట్టాలకు మరమ్మతులు చేస్తుండగా వేడినీళ్లు లీకై మీద పడటంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వేడినీళ్లు పడి ఇద్దరికి గాయాలు