ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడపలో ట్రాఫిక్​ నిబంధనలపై​ అవగాహన సదస్సు - traffic councelling in kadapa dsp office

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు... కడప డీఎస్పీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితులకు ట్రాఫిక్​పై​ అవగాహన సదస్సు నిర్వహించారు.

కడపలో ట్రాఫిక్​ నిబంధనలపై​ అవగాహన సదస్సు

By

Published : Nov 17, 2019, 11:56 PM IST

కడపలో ట్రాఫిక్​ నిబంధనలపై​ అవగాహన సదస్సు

రోడ్డు ప్రమాద బాధితులకు పోలీస్ శాఖ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని... కడప డీఎస్పీ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. కడప డీఎస్పీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితులతో... సమావేశం నిర్వహించారు. ప్రమాదాలకు గురైన వారు అనుభవిస్తున్న కష్టాలను, వారికి రావాల్సిన పరిహారం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కేవలం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని... కనీస జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని డీఎస్పీ సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు.

ABOUT THE AUTHOR

...view details