Threats to CBI officers in Kadapa: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారులకు కడపలో బెదిరింపులు ఆరంభమయ్యాయి. సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించినట్లు పోలీస్ స్టేషన్లో డ్రైవర్ ఫిర్యాదు చేశారు. కడప నుంచి కేంద్ర కారాగారానికి వెళుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు. కడప నుంచి వెళ్లిపోవాలంటూ వాహనంలో ఉన్న డ్రైవర్, అధికారులను కూడా బెదిరించారు. ఈ మేరకు సీబీఐ అధికారులు చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన వెంటనే స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఎవరు బెదిరించారనే విషయంపై సీసీ ఫుటేజ్ పరిశీలన చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
సీబీఐ అధికారులకు బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు - Threats to CBI officers in Kadapa
Threats to CBI officers: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారులకు కడపలో బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వారు చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Threats to CBI officers