కడపకు చెందిన ఓ వ్యక్తిని..నలుగురు వ్యక్తులు హత్యచేసి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు కడప నగరంలోని చికెన్‌షాపులో పనిచేస్తున్నారు. వారితో గౌస్‌నగర్‌కు చెందిన ఇంతియాజ్‌కు పరిచయమేర్పడింది. గతరాత్రి వారు నివాసముంటున్న గదికి వచ్చిన షేక్ ఇంతియాజ్ ఉదయాన్నే... ఇంటి యజమానికి శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో జాగిలాలతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
కడపలో వ్యక్తి దారుణ హత్య... యూపీ యువకులపై అనుమానం! - కడప జిల్లా గౌస్‌నగర్ లో వ్యక్తి దారుణ హత్య
కడప గౌస్ నగర్ లో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
కడపలో వ్యక్తి దారుణ హత్య... యూపీ యువకులపై అనుమానం!