ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల్లో వైకాపా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడింది: తెదేపా - వైకాపా ప్రభుత్వంపై తెదేపానేతల విమర్శలు

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా...అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిందని తెదేపా నేతలు ఆరోపించారు. రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కడప తెదేపా కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

Tdp meeting on municipal elections in Kadapa
పురపాలక ఎన్నికలపై తెదేపానేతల సమావేశం

By

Published : Feb 15, 2021, 9:13 PM IST


ఏడాది కిందట మున్సిపల్​ ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల సంఘం తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కడప తెదేపా పార్లమెంటు అధ్యక్షులు లింగారెడ్డి డిమాండ్ చేశారు. కడప తెదేపా కార్యాలయంలో రానున్న మున్సిపల్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అందరూ కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని తీర్మానం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా... అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం, రాజధాని తదితర విషయాలలో మోసపోయామన్నారు. ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కావున ఇవన్నీ రాష్ట్రానికి దక్కాలంటే రానున్న ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేయడమే మార్గమన్నారు.

ABOUT THE AUTHOR

...view details