TDP leaders protest: కడప నగరంలో పేదల ఆకలి తీర్చేందుకు నిర్మించిన అన్న క్యాంటీన్‌ను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నిరసన దీక్షకు పూనుకుంది. తెదేపా ఇంఛార్జి అమీర్‌బాబు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు సురేష్, గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో దీక్ష చేపట్టారు.
TDP leaders protest: "అన్న క్యాంటీన్" పునరుద్ధరించాలి:తెదేపా - కూల్చిన అన్నా కాంటీన్ను పునరుద్ధరించాలన్న తెదేపా నేతలు
TDP leaders protest: కడపలో అన్న క్యాంటీన్‌ను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ.. తెదేపా నిరసన దీక్ష చేపట్టింది. కూల్చిన అన్న క్యాంటీన్‌ను వెంటనే పునరుద్ధరించాలని, పెట్రోల్ బంక్ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
అన్నా కాంటీన్
గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తే.. ఈ ప్రభుత్వం కూల్చడమేంటని ప్రశ్నించారు. కూల్చిన అన్న క్యాంటీన్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం మార్చుకునే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:No Permission: విజయవాడలో రైతు గర్జన సభ.. అనుమతి నిరాకరణ.. పలువురు అరెస్టు