ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా

By

Published : Aug 18, 2020, 9:54 PM IST

Updated : Aug 19, 2020, 1:19 AM IST

jc prabhakar reddy
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా

21:51 August 18

జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా

కడప జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా పాజిటివ్​ నిర్ధారణయ్యింది. ఈ క్రమంలో జైలు సిబ్బంది ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి.. ముగ్గురు వైద్యులతో పర్యవేక్షణ చేయిస్తున్నారు. బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్​ వ్యవహారంలో ఇటీవల బెయిల్​పై విడుదలైన అనంతరం 24 గంటల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు జేసీ ప్రభాకర్​ రెడ్డిని అరెస్టు చేశారు. 

సోమ, మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో.. జైలులో మొత్తం 317 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం అందరినీ ప్రత్యేక వార్డుల్లో పెట్టి పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి..

శిరోముండన బాధితుడి దస్త్రం సామాజిక న్యాయశాఖకు బదిలీ

Last Updated : Aug 19, 2020, 1:19 AM IST

ABOUT THE AUTHOR

...view details