కొవిడ్ రోగులకు సహయాన్ని అందిస్తున్న వారికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ధన్యవాదాలు తెలిపారు. కడప క్యాంపు కార్యాలయంలో ఎస్డీఐఎఫ్ యువకులు ఉప ముఖ్యమంత్రిని కలిసి 20 ఆక్సిజన్ సిలిండర్లు, 20 రెగ్యులేటర్లను, 5 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ లను అందించారు.
యువకులైన గౌస్ మొహిద్దీన్, ఖాలిద్ వారి మిత్రబృందం కలిసి ఎస్డీఐఎఫ్ సంస్థ ద్వారా.. ఎంతో మందికి సేవ చేయటం సంతోషించదగ్గ విషయం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే వీరి ఆధ్వర్యంలో కడపలో ఉచిత అంబులెన్స్ సర్వీసు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ పట్టభద్రులైన వీరంతా పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ.. సమాజానికి ఉపయోగపడటం అభినందనీయం అన్నారు.